Thursday, February 24, 2011

సెగట్రీ...ఈ మృత్యువు అడ్రసేటో కనుక్కో డిక్కీలో తొంగోబెట్టేదాం


దీన్సిగతరగా ఎదవ మృత్యువు...అభిమానులందరూ మాంచి నిద్రలో ఉండగా దొంగచాటుగా వచ్చి రమణని తీసుకుపోతుందా. అయినా దానికి లేకపోతే పోయే ఆ పెద్దాయనకైనా  ఉండద్దూ..."అప్పు" డే నా అని ఇంకో వందేళ్ళు జీవితాన్ని "ఋణం" గా తీసుకోవచ్చుగా దాన్దగ్గర. బాపు గురించి కాస్తయినా ఆలోచించాడా? లేకపోతే సీరామ రాజ్యం కత . డవిలాగులు మా బాగా రాసేసుంటాడు..ఆ రాములోరికి ముచ్చటేసి ఇలాంటోడు మన ఇలాకాలో ఉండాలి గానీ సీపుగా భూలోకం లో ఏంటి అని రాత్రికి రాత్రి "జనతా ఎక్స్ప్రెస్" లాంటి బండోటి పంపించి పిలిపించేసుకున్నడేమో. అసలే మనోడు ఈ మధ్యే "కోతి కొమ్మచ్చి" ఆడి ఆడి ఉన్నాడేమో ఆ "రాంబంటు" కోతి వచ్చి రాములోరు రమ్మంటున్నారు అని చెప్తే  గెంతుకుంటూ బండెక్కేసుంటాడు. సమయానికి బుడుగ్గాడు ఉన్నా బావుణ్ణు బాపు-రమణ ల "స్నేహం" గురించి చెప్పి ఠాట్ వెళ్ళడానికి వీల్లేదంటూ అడ్డేసేవాడేమో. అయినా ఎక్కడికి పోతాడ్లే...తెలుగోళ్ళు ఉన్నంత వరకూ మారేసం లో మన చుట్టూనే ఉంటాడు. మనమూ అక్కడికి వెళ్ళకపోతామా, అప్పుడు ఏటీ పని అని నిలదీసి ప్రైవేట్ చెప్పెయమూ.

అయినా ఆయన్లేడంటే మనసులో ఏదో మడతడిపోయినట్టు, గుండెలో గుండు సూది గుచ్చినట్టు ఎక్కడో ఏదో నొప్పి. అవున్లే సడెన్గా దేవుడు రేపట్నించి భూమీద ఉండడు అంటే భక్తులకామాత్రం బాధ ఉండదేంటి? అసలు ఆయన్ని తీసుకెళ్ళిన ఆ మృత్యువు  అడ్రసేటో కనుక్కో డిక్కీలో తొంగోబెట్టేదాం 



17 comments:

తృష్ణ said...

అపూర్వమైన స్నేహానికి నిర్వచనం చెప్పిన
ఆ ఇద్దరు స్నేహితులను తలచుకుంటే నాకు గుర్తుకొచ్చేదొకటే పాట...
"కొంతకాలం క్రిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట..ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం.."
రమణగారు లొకాన్ని విడిచి వెళ్ళినా బాపుగారి నీడై ఆయన బొమ్మల్లో, కుంచెల్లో, అభిమానుల మనసుల్లో ఎప్పటికీ ఉండిపోతారన్నది సత్యం. May his soul rest in peace.

ఆ.సౌమ్య said...

చాలా బాగా రాసారండీ...ఏడుపు ఆగట్లేదు :(

సిరిసిరిమువ్వ said...

"తెలుగోళ్ళు ఉన్నంత వరకూ మారేసం లో మన చుట్టూనే ఉంటాడు" నిజమండి ఇలాంటి వారికి మరణం లేదు.

Unknown said...

మరపురాని మనిషి, అజరామరమైన స్నేహం.. రమణగారిని బాపూ గారే కాదు. ఎవరూ మర్చిపోలేరు. వారు మనందరి హృదయాలలొనూ ఎప్పటికీ చిరంజీవి..

మైలవరం said...

mee blog bavundi sir. very intrestig. i folling ur blog. thank u sir

గిరీష్ said...

may his soul rest in peace..
nice narration

Srikalpana said...

తెలుగు భాష తియ్యదనాన్ని ఆస్వాదించే ప్రతి ఒక్కరి గుండె మూగబొయిన రోజు.
ముళ్ళపూడి రమణ గారు ఇక లేరంటే నమ్మబుద్దికావడంలేదు. హాస్యాన్ని ప్రేమించే ప్రతి వారి మదిలొ కొలువై ఉంటారు ఎప్పటికి.

Srikalpana said...

తెలుగు భాష తియ్యదనాన్ని ఆస్వాదించే ప్రతి ఒక్కరి గుండె మూగబొయిన రోజు.
ముళ్ళపూడి రమణ గారు ఇక లేరంటే నమ్మబుద్దికావడంలేదు. హాస్యాన్ని ప్రేమించే ప్రతి వారి మదిలొ కొలువై ఉంటారు ఎప్పటికి.

శుభకరుడు said...

చాలా బగా రాశారండీ.. నమ్మలేని నిజం.. చాలా బాధపెడుతుంది.

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

బాగా వ్రాశారు

Suneel Vantaram said...

పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు..ఉన్న కథలు పోయినోళ్ళ "తీపి" గురుతులు.. మీ బ్లాగునకు కృతఙతలు.

Suneel Vantaram said...
This comment has been removed by the author.
కొత్త పాళీ said...

probably the best tribute I've read so far. well done.

bharadwaj said...

Ramana gari leni lotu teleugu sahithyam lo evaru poodchalenidhi. Kotlaadhi abhimanula tharapunaa Ramanagari aathma santhinchaalani koruthoo...

Ramani Rao said...

"అయినా ఆయన్లేడంటే మనసులో ఏదో మడతడిపోయినట్టు, గుండెలో గుండు సూది గుచ్చినట్టు ఎక్కడో ఏదో నొప్పి. అవున్లే సడెన్గా దేవుడు రేపట్నించి భూమీద ఉండడు అంటే భక్తులకామాత్రం బాధ ఉండదేంటి? అసలు ఆయన్ని తీసుకెళ్ళిన ఆ మృత్యువు అడ్రసేటో కనుక్కో డిక్కీలో తొంగోబెట్టేదాం ..."

చాలా బాగా రాసారండి ఎలాగయినా ఆ మృత్యువు ఎడ్రస్ కనుక్కొండి శంకర్ గారు. రమణగారిని మళ్ళీ రప్పించుకుందాము. బాధని పంచారు/పెంచారు.

Ennela said...

అందరినీ నవ్వించే రమణ గారికి ఇది నిజమైన నీరాజనం..//మృత్యువు అడ్రసేటో కనుక్కో డిక్కీలో తొంగోబెట్టేదాం // ఇది చూసి ఆయనా నవ్వుకుంటున్నారేమో...

సుమలత said...

baga rasaramdi ....
రమణ గారు యిక లేరంటే చాల బాదేస్తుంది..